BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
దక్షిణ కోస్తా రైల్వే జోన్: విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభం.. ఈ కొత్త జోన్ పరిధిలోకి ఏపీలోని 4 రైల్వే డివిజన్లు
విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ జూన్ 1 నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. కొత్తగా ఏర్పడ్డ దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో నాలుగు డివిజన్లు ఉంటాయి. విశాఖలోని జోనల్ ప్రధాన కార్యాలయం నుంచి వీటి పరిపాలన సాగుతుంది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఇది ఒకటి.
విరాట్ కోహ్లీ: ఛేజింగ్ అంటే, ఎప్పటికీ గుర్తుండిపోయే 5 ఐకానిక్ ఇన్నింగ్స్
పాకిస్తాన్‌పై మ్యాచ్ గెలిచిన వెంటనే మైదానంలో మోకాళ్లపై కూర్చొని, కళ్లు మూసుకొని ఆకాశం వైపు చూస్తూ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. ఆ సమయంలో ఫామ్ లేమితో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లీ ఈ ఇన్నింగ్స్‌తో తన విలువను మరోసారి చాటుకున్నాడు.
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
RCB vs GT: 16వ ఓవర్లో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ మధ్య వాగ్వాదం జరిగిందా?
గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఛేదించే క్రమంలో.. మ్యాచ్ 16వ ఓవర్లో మైదానంలో తీవ్ర ఉత్కంఠభరితమైన డ్రామా చోటు చేసుకుంది.
పెళ్లైన వారే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎందుకు?
వివాహ బంధంలో పెరుగుతున్న ఒత్తిళ్లు, మారుతున్న సామాజిక సమీకరణాలు నేటి తరాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి? దేశంలో నమోదవుతున్న ఆత్మహత్యల గణాంకాల్లో వివాహితుల సంఖ్య పెరగడం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఏం చెబుతోంది?
హోప్: ఈ తిమింగలం పేలిపోవచ్చన్న ఆందోళన ఏంటి?
డెన్మార్క్‌లోని అన్‌హోల్ట్ ద్వీపంలోని ఒక మోటారు సాయంతో తిమింగలాన్ని నెమ్మదిగా ఒడ్డు వైపు లాక్కొస్తున్న దృశ్యాలను జర్మన్ న్యూస్ వెబ్సైట్ న్యూస్ 5 పోస్ట్ చేసింది. తిమింగలం మృతదేహానికి డెన్మార్క్ పర్యావరణ సంస్థ గురువారం పోస్ట్ మార్టం నిర్వహించనుంది.
ఆర్సీబీ: కుటుంబ సభ్యులతో కలిసి టీమ్ ఆనందోత్సాహాలు- 5 ఫోటోలలో..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండోసారి టైటిల్‌ను గెలుచుకుంది. ఆర్సీబీ జట్టు విజయం సాధించడంతో కొంతమంది క్రికెటర్ల భార్యా పిల్లలు స్టేడియంలో సందడి చేశారు.
ఐపీఎల్- 2026 విజేత ఆర్సీబీ, వరుసగా రెండోసారి టైటిల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా రెండోసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ఆర్సీబీ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
'భారత్‌లోనే పుట్టి పెరిగాం, కానీ ఇప్పుడు వెళ్లిపోవాల్సి వచ్చింది’ అంటున్న బంగ్లాదేశీలు
బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు అక్రమంగా వచ్చి నివాసముంటున్న ఎంతోమంది తిరిగి తమ దేశానికి వెళ్లిపోతున్నారు. గత కొద్దిరోజులుగా వందలాది మంది, పశ్చిమ బెంగాల్‌లోని హకీంపూర్ సరిహద్దు వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి ప్రస్తుత పరిస్థితిపై బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
షార్ట్ వీడియోలు
ఇరాన్
ఫీచర్లు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.
అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్‌ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































